శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:20 IST)

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై విమర్శలు... మంత్రుల కమిటీ ఏమంటోంది?

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. టిక్కెట్ ధరల విషయంలో విమర్శల కారణంగా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 
 
నేడు వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తి పెరుగుతుంది.
 
ఈ కమిటీ ప్రతిపాదనలను ఖరారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కమిటీ నివేదికను కోర్టుకు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. హోమ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వం లో 13 మందితో కమిటీ సమావేశం నిర్వహిస్తారు.