శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (19:54 IST)

కొత్త పే స్కేలు ప్రకారం వేతనాలు పడిపోయాయ్ : సజ్జల వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త వేతన స్కేలు ప్రకారం (పీఆర్సీ) కొత్త జీతాలు వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు ప్రభుత్వ సలహారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మరోవైపు, ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు పాత వేతనాలే కావాలంటూ రోడ్డెక్కిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో కొత్త వేతనాలను జమ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు అసలు అంశాన్ని పక్కదారి పట్టించి లేనిపోని అంశాలపై రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగులు ఓపెన్ మైండ్‌తో మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఆయన కోరారు. ఉద్యోగులకు అన్యాయం చేయాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వం ఎంతమాత్రం కూడా లేదన్నారు. 
 
అదేసమయంలో వారు చేస్తున్న డిమాండ్ మేరకు పాత వేతనాలు ఇవ్వడం కుదరదన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ మేరకు కొత్త వేతనాలు పడిపోయాయని చెప్పారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఏదో సాధించాలని భావించడం లేదన్నారు. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగులు పదేపదే ఎందుకు అడుగుతున్నారని, ఆ నివేదికను ఇస్తేఅంతా అయిపోతుందా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.