సమ్మె అనేది.. ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు : ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ సాధన కోసం ఈ నెల 7వ తేదీన సమ్మె తలపెట్టనున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సమ్మెను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సమ్మె అనేది ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది.
ఉద్యోగుల అమలుపై హైకోర్టు మంగళవారం మధ్యంతరం ఉత్తర్వులు జారీచేసింది. ఐఆర్ అడ్జస్ట్‌మెంట్ చేస్తామన్న ప్రభుత్వం ఆదేశాలపై కోర్టు స్పందించింది. ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయరాదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.