ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనం ప్రకారమే వేతనాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఆందోళనకు దిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
పీఆర్సీపై స్పష్టత లేదని, దీనిపై స్పష్టత వచ్చేంతవరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త వేతనాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాల కోరికను ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, జనవరి నెల జీతాలను కొత్త పే స్కేలు ప్రకారమే అమలు చేసినట్టు ఆర్థిక శాఖ కూడా వెల్లడించింది.