శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (15:11 IST)

ట్విట్టర్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం

ట్విట్టర్ యాజమాన్యంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో మరోమారు మండిపడింది. భారతదేశ చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకపోతే వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పైగా, ట్విట్టర్ యాజమాన్యంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. 
 
ట్విట్టర్‌లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు డిలీట్ చేసినప్పటికీ... విపిన్ అని టైప్ చేస్తే ఆ పోస్టులు వెంటనే వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి న్యాయవాది అశ్విని కుమార్ తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ట్విట్టర్ వద్ద ఉ్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పోలీసులను పంపి ఆ మెటీరియల్ స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.