Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ
Satwik Varma, Preeti Neha
నటీనటులు: సాత్విక్ వర్మ, ప్రీతీ నేహా
సాంకేతికత: నిర్మాత: కనకదుర్గారావు పప్పుల, దర్శకత్వం: భాను, విడుదల: నవంబర్ 7,2025
కథ:
వయస్సులో వున్న కథానాయకుడు సాత్విక్ వర్మ.. ప్రీతీ నేహా చూడగానే ప్రేమను వ్యక్తం చేస్తాడు. అదికూడా భిన్నంగా వుండాలనే ఆలోచనగా నీతో రొమాన్స్ చేయాలని ఉంది.. అనే ప్రపోజల్ పెడతాడు. అతని మాటలు పెద్దగా పట్టించుకోదు కానీ ఇదే పనిగా వర్మ ఆమెను ఫాలో అవుతూంటాడు. ఫైనల్ గా అతని ప్రపోజల్ కు ఓకే చెబుతూ, ఓ కండిషన్ పెడుతుంది. అనంతరం జరిగిన పరిణామాలతో సాత్విక్‌ని ప్రీతీ దూరం పెడుతుంది. ఆ పరిణామాలు ఏమిటి? ప్రీతి ప్రేమ కోసం అతను పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? తన ప్రేమలో నిజాయితీ వుందనేలా అతను ఏం చేశాడు? అతని తల్లి శారద ఎం చేసింది? అనంతరం జరిగిన పరిణామాలే మిగిలిన సినిమా.
సమీక్ష:
ముందుగా దర్శకుడు భాను గురించి చెప్పాలి. తన తీసిన గతంలోని సినిమాలలోనూ పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పేస్తాడు. కొన్ని ఆలోచించే అంశాలుంటాయి. అదేవిధంగా ఈ సినిమాలో ప్రేమ, వ్యామోహం అనే అంశాలను టచ్ చేశాడు. ఇప్పటి జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యే కథ. అందుకోసం స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో కాస్త బోల్డ్‌గా చూపించారు దర్శకుడు.
సినిమా ప్రారంభంలో హీరోది నిజమైన ప్రేమ అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రవర్తన చూసి కోపం, అసహ్యం కూడా కలుగుతుంది. కానీ రాను రాను ఇది కూడా ప్రేమలో ఒక భాగమే కదా.. తప్పు ఎందుకు అవుతుందనే భావన కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ దాని చుట్టు అల్లుకున్న సీన్లు..డైలాగులు అన్నీ బాగున్నాయి. కథను ముందు వెనక్కీ నడుపుతూ రాసుకున్న స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని పెంచేలా చేసింది.
అయితే ఇలాంటి కథకు సరిపడా కొత్తవారిని ఎంపికచేయడం బాగుంది. హీరోయిన్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడడం నుంచి రకరకాల సన్నివేవాలతో ఎంగిలి కూడా తినడం అనేవి ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేస్తాయి. అమ్మాయి రొమాన్స్ ఒప్పుకోవడంతో కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అమ్మాయి ఎందుకు అంతగా అసహ్యయించుకుంది? ఆస్పత్రిలో రొమాన్స్ తర్వాత ఏం జరిగిందనేది ముందే చెప్పకుండా..ప్రస్తుతాన్ని, ప్లాష్‌బ్యాక్‌ని మిక్స్ చేసి కథను చెబుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. తర్వాత ఒక్కో ట్విస్ట్ ఆసక్తిగా వుంటుంది.
తన కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు, అమ్మాయి ప్రేమ కోసం హీరో పడే తాపత్రాయాలు భావోద్వేగానికి లోను చేస్తాయి. ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. తనది నిజమైన ప్రేమ అని తెలిసిన తర్వాత హీరో తీసుకునే నిర్ణయం, సంబాషణలు బాగున్నాయి. అసలైన ప్రేమ అంటే ఏంటి? లవ్‌కి లస్ట్‌కి తేడా ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. యూత్‌తో పాటు లవ్‌లో ఉన్న వారందరికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
బాల నటుడిగా అందరికీ తెలిసిన సాత్విక్ వర్మ ఇందులో హీరో పాత్రను పోషించాడు. పిచ్చి ప్రేమికుడిగా నటన బాగా చూపించాడు. అవి అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 చిత్రాల్లోని పాత్రలను పోలివుంటాయి. రొమాంటిక్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ప్రీతీ నేహా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించడమే కాకుండా..నటనతోనూ ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమే నటించారు.
ఇటువంటి ప్రేమకథకు పాటలు, నేపథ్య సంగీతం కీలకం. కనుక దర్శకుడు వాటిని ప్రధాన బలంగా చేయించుకోగలిగాడు. కథలో భాగంగానే పాటలు వుంటాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చిన్నపాటి లోపాలున్నా మంచి సినిమా చూసిన ఫీలింగ్ యువతకు కలుగుతుంది.
రేటింగ్: 2.75/5