గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-02-2022 మంగళవారం రాశిఫలితాలు - ఏదో సాధించలేక పోయామన్న...

మేషం :- ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ వహించండి. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
వృషభం :- ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అతిథి మర్యాదలు ఘనంగా చేస్తారు.
 
మిథునం :- ఉద్యోగస్తులు, అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. సభలు, సమావేశాలలో పాల్గొనటం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన అభివృద్ధి.
 
కర్కాటకం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతారహితంగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
సింహం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. రావలపిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.
 
కన్య :- విదేశీయానం కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. గృహోపకరణాలు అమర్చుకుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అధికం కావడం, వృధా ధనవ్యయం వల్ల నిరుత్సాహం చెందుతారు.
 
తుల :- స్త్రీలతో కలహములు, అన్నికార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. వాయిదా పడిన మొక్కుబడులు అనుకోకుండా తీర్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ముందుగా ఊహించిన ఖర్చులు కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
 
వృశ్చికం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. సహోద్యోగులు సహకరించక పోవటంతో నిరుత్సాహం చెందుతారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- చేతివృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. మొండి బాకీలు వసూలు కాగలవు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చు తప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఇతరుల విషయంలో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కుంభం :- విద్యార్థులకు ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరుల సలహాను పాటించుట వలన సమస్యలు తప్పవు. వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మీనం :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం అంతగా ఉండదు. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.