గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-01-2022 ఆదివారం రాశిఫలితాలు - దక్షిణామూర్తిని ఆరాధించినా...

మేషం :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. మీ కళత్రం కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
వృషభం :- ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమాధికృత ఎదుర్కున్నా సత్ఫలితాలు పొందుతారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది.
 
మిథునం :- వస్త్ర, బంగారం వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి చేకూరుతుంది. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
కర్కాటకం :- విదేశీ ప్రయాణాలు వాయిదాపడగలవు. విందుల్లో పరిమితి అవసరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. రుణం, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.
 
సింహం :- గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మెళకువ వహించండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సాహస యత్నాలు విరమించుకుంటారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కన్య :- విదేశాలు వెళ్ళాలనే కోరిక అధికం అవుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ముఖ్యల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. స్త్రీల సహకారంతో మీ దీర్ఘకాలిక సమస్య ఒక కొలిక్కి వచ్చే రాగలదు.
 
వృశ్చికం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
 
ధనస్సు :- బంధువులతో కలసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలు తొందరపడి వాగ్దానాలు చేయటంవల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ప్రత్యర్థులు మిత్రులగా మారతారు.
 
మకరం :- సంఘంలో మీకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆత్మీయల కోసం ధనం విరివిగా వ్యయంచేస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలడు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
కుంభం :- దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రియతములను కలుసుకుని విలువైనకానుకలిచ్చి పుచ్చుకుంటారు. ఏ.సి., మెకానికల్ రంగాల్లో వారికి, చేతిపనివారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సహాయం పొంది మీకు విరోధులు అయ్యే అవకాశం అధికంగా ఉంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది.
 
మీనం :- స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సోదరులతో ఏకాభవించలేకపోతారు. రాజకీయనాయకులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.