గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-01-2022 శుక్రవారం రాశిఫలితాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల శుభం...

మేషం :- లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. శ్రీమతితో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, లోన్లు మంజూరవుతాయి.

వృషభం :- చేతి వృత్తుల వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో మెళుకువ అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బకాయిల వసూలులో సంయమనం పాటించండి.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. రవాణా, ప్రకటనలు, విద్యా రంగంలోని వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలే జరుగుతుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. ఖర్చులు అధికమవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కర్కాటకం :- ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. జాగ్రత్త వహించండి. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు.
 
కన్య :- మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కుటింబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
తుల :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పరస్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
వృశ్చికం :- పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఆప్తులరాకతో గృహం సందడిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది.
 
ధనస్సు :- బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. సొంత వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. భార్యా, భర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విదేశాలలో ఉన్న బంధువులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- స్త్రీలకు బంధువులలో సఖ్యత నెలకొంటుంది. పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బంధువులరాక సంతోషాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పడికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.
 
కుంభం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి.
 
మీనం :- స్త్రీలకు వస్తు, వస్త్ర, అభరణాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పరోపకారానికి పోయి సమస్యలను తెచ్చుకుంటారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. రాజకీయ పార్టీల నాయకులకు ఒకస్థాయి పెరుగుతుంది.