మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-01-2022 సోమవారం రాశిఫలితాలు - లలిత సహస్రనామ పారాయణం చేసిన శుభం..

మేషం :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
 
వృషభం :- వృత్తి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దైవదర్శనాలు, మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. మిత్రుల నుండి మొహమాటాలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుండి అభ్యంతరాలను ఎదుర్కొంటారు.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తాయి. పారిశ్రామికరంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రేమికులు, విద్యార్థులు అతిగా వ్యవహరించుట వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు.
 
కర్కాటకు :- ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. తరచూ సన్మానాలు సభల్లో పాల్గొంటారు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత ప్రధానం.
 
సింహం :- తల పెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. ఒక వ్యవహరారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కన్య :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతిరూలతలు అధికం. విద్యార్థులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సకాలంను సద్వినియోగం చేసుకోండి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
తుల :- మిమ్మల్ని పొగిడే వారి విషయంలో జాగ్రత్త వహించండి. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత ప్రధానం. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. లీజు, ఏజెన్సీలు, నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదని గమనించండి.
 
వృశ్చికం :- రవాణా రంగంలోని వారు ఇబ్బందులను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. ఒక సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరక బాధలు సంభవిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు, క్లెయింలు మంజూరవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
కుంభం :- ఆదాయ వ్యయాల లెక్కలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో అవకాశం, బహుమతులు అందుతాయి. కోర్టు వాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాల్లో అధికమైన ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యార్థులకు ఆందోళన, నిరుత్సాహం వంటివి అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. పత్రికా సంస్థలలోని వారికి ఒక సమాచారం అందోళన కలిగిస్తుంది.