సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-01-2022 బుధవారం రాశిఫలితాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

మేషం :- వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు దూకుడు తగదు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభించదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సొంతంగాగాని, భాగస్వామ్యంగాగాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. బంధువులతో సంబంధాలు బలపడతాయి.
 
మిథునం :- మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగల్గుతారు. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని పనులు సాధిస్తారు. సహోద్యోగులతో వాగ్వాదాలు తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
కర్కాటకం :- ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
సింహం :- పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. వ్యాపారంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ముందస్తు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.
 
తుల :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుండి అభ్యంతరాలను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. భాగస్వామిక సంస్థల్లో మీ పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. చీటికి మాటికి ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. తరుచూ సభలు, వేడుకల్లో పాల్గొంటారు. ఆశాదృక్పథంలో కొత్తయత్నాలు సాగిస్తారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు ఊహించినవి కావటంతో ఇబ్బందులుండవు.
 
మకరం :- ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సభ్యత్వాలు, పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది.
 
కుంభం :- స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. విద్యారులు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధవహిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం :- చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి.