శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-01-2022 మంగళవారం రాశిఫలితాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన శుభం...

మేషం :- ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబీకులకు అన్ని విషయాలు తెలియజేయండి.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సహోద్యోగుల సాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాలలోను ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, పురోభివృద్ధి గడిస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు నూతన ప్రాజెక్టులు, పరిశ్రమలు, టెండర్లకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. సాహసకృత్యాలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ప్రయాణం సజావుగా సాగుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
 
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతారు.
 
కన్య :- కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. ఫైనాన్సు రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి.
 
తుల :- ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాకులు ఒత్తిడి, చికాకులు అధికం. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. బంధువులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతర విషయాలపై ఆసక్తిని తగ్గించి, స్వవిషయాలపై శ్రద్ధ పెడితే మంచిది. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత అవసరం. రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది.
 
ధనస్సు :- ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంధ బాంధ్యవ్యాలు నెలకొని ఉంటాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక వాయిదాపడుతుంది. 
 
మకరం :- తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. యాధృచ్ఛికంగానే దుబారా ఖర్చులు అధికమవుతాయి. ప్రస్తుత వ్యాపారాల పైనే శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు.
 
కుంభం :- మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు మందకొడిగా వుండగలదు. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు.
 
మీనం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. వాహనచోదకులకు దూకుడు తగదు. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.