సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-01-2022 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

మేషం :- చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధికానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. భాగస్వామికుల మధ్య చీలికలు వచ్చే ఆస్కారం ఉంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది.
 
వృషభం :- గృహంలో మార్పులు, మరమ్మతులు వాయిదా వేయటం మంచిది. ప్రముఖుల కలయిక సాధ్య పడుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పాత మిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మిథునం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయటం క్షేమదాయకం.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బంధువులు మీ మాటలను అపార్థం చేసుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. రుణం ఏకొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. విందులలో పరిమితి పాటించండి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు తొలగిపోతాయి.
 
తుల :- స్త్రీలు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. 
 
వృశ్చికం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల రాకతో ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. మనుషుల మనస్తత్వము తెలిసి మసలు కొనుట మంచిది.
 
ధనస్సు :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయలను సందర్శిస్తారు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. స్త్రీల కారణంగా మాటపడవలసి వస్తుంది.
 
మకరం :- జూదాలు, బెట్టింగ్ వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. నిరుద్యోగులు ఆశిస్తున్న అవకాశాల కోసం గట్టి యత్నాలు చేయవలసి ఉంటుంది. చేపట్టిన పనులలో ఏకాగ్రత అంతగా ఉండదు. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
కుంభం :- వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల సదావకాశాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
 
మీనం :- రావలసిన ధనం అందక పోవటంతో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బంధుమిత్రులు మిమ్ములను మొహమాట పెట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులలో ఏకాగ్రత అంతగా ఉండదు.