గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-01-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

మేషం :- ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. పెద్దల ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. నూతన పెట్టుబడులు, ఉమ్మడి వెంచర్లు, టెండర్లకు అనుకూలం. దూర ప్రాంతం నుండి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది.
 
వృషభం :- ఉద్యోగస్తుల పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం విద్యా, ఆరోగ్యం విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారంఉంది.
 
మిధునం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక వ్యవహరారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. స్త్రీలు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రత లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు. ప్రయాణాల్లో ఊహించని చికాకులెదురవుతాయి. రాబడికి మించిన ఖర్పులెదురైనా ఇబ్బందులుండవు.
 
సింహం :- వైద్యరంగంలోని వారు అరుదైన శస్త్రచికిత్సలు సమర్థగా నిర్వహిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది.
 
కన్య :- ఆస్తి పంపకాల విషయమై సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలు ప్రతిభాపోటీల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
తుల :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. కళ, క్రీడలు, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు కూడా ఉంటాయి.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగా స్థిరపడతారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల రాక వల్ల ధన వ్యయం అధికమవుతుంది. గృహంలోను, సంఘంలోను అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వీలైనంతవరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ధనం చేతిలో నిలబడటం కష్టమే. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఎదుటివారితో వాగ్వివాదాలు, పంతాలకు పోవటం మంచిది కాదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి.
 
కుంభం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పుణ్యక్షేత్ర సందర్శనలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మీనం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రముఖుల కలయికతో మీ పనులు సానుకూలమవుతాయి. విద్యార్థులకు పాఠ్యాంశాలు, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. సంఘంలోను, కుటుంబంలోను మీ అభిప్రాయాలకు గౌరవం లభిస్తుంది. మిత్రులకి చ్చిన మాట నిలబెట్టుకుంటారు.