సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-01-2022 బుధవారం దినఫలాలు : సత్యదేవుని పూజించి...

మేషం :- వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవటం మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
వృషభం :- కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. తల పెట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. స్త్రీలకు టివి ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించగలవు.
 
మిథునం :- వ్యాపారాల్లో మంచి మాటలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. అందరికీ సహాయం చేసి నిందారోపణ ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపట్ల మక్కువ పెరుగుతుంది.
 
కర్కాటకం :- గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. పందాలు, పోటీలలో విజయం సాధిస్తారు. ఎలక్ట్రానిక్ ఛానెళ్ల సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పాత మిత్రుల కలయిక, సన్నిహితుల సలహాలు మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.
 
సింహం :- అందరితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. తరుచుగా తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాతాపపడతారు. సాహస యత్నాలకు ఇది తగి సమయం కాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి.
 
కన్య :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. గతంలో నిలిచి ఉన్న పనులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల స్త్రీలు స్వల్ప అస్వస్థతకు లోనవుతారు.
 
తుల :- ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. రుణయత్నాల్లో అనుకూలత, రావలసిన ధనం అందటంతో మీ ఆలోచను పలు విధాలుగా ఉంటాయి. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిదికాదు.
 
వృశ్చికం :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆర్థిక స్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు నెమ్మదిగా సమసిపోతాయి. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు చురుకుగా సాగుతాయి.
 
ధనస్సు :- విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధు మిత్రులతో కలసి విందు, వేడుకలలో పాల్గొంటారు.
 
మకరం :- స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. స్వయంకృషితోనే రాణిస్తారన్న విషయాన్ని గ్రహించండి. తల పెట్టిన పనులలో అవాంతరాలెదుర్కుంటారు. విదేశీ యత్నాలలో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు.
 
కుంభం :- ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులెదురవుతాయి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో ముఖ్యమైన విషయాలు సంప్రదింపులు జరుపుతారు.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం , ప్రయాసలు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం.