గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-12-2021 శుక్రవారం దినఫలాలు - దత్తాత్రేయుడిని పూజిస్తే..?

31-12-2021 - శుక్రవారం.. శ్రీ పవనామ సం॥ మార్గశిర బ॥ ద్వాదశి ఉ.7.34 త్రయోదశి తె.5.15 అనూరాధ రా.8.13 రా.వ.1.25 ల 25 ఉ.దు..300 9.14 పుదు. 1211 ల 1255.
 
దత్తాత్రేయుడిని దర్శించినా శుభం కలుగుతుంది
 
మేషం:- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తలకు మించిన భాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు.
 
వృషభం :- బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి యత్నాలు మొదలెడతారు. పెద్దల ఆరోగ్యములో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి.
 
మిధునం:- ట్రాన్స్పర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం: - ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు అనుకున్నంత సాఫీగా సాగవు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
సింహం:- స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించటం క్షేమదాయకం, అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
 
కన్య - కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పని వారలతో చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకలు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివచ్చేకాలం.
 
తుల:- వృత్తి వ్యాపారాల్లో రాణించటానికి బాగా శ్రమించాలి. ఆప్తుల ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సన్నిహితులు, కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం: - కుటుంబీకుల తీరు కొంత మనస్తాపం కలిగిస్తుంది. ఉన్నతాధికారులకు శాఖాపరమైన మార్పు లుంటాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగ రీత్యా నూతన పరిచయాలేర్పడతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు.
 
ధనస్సు: - వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు ప్రజాసంబంధాలు బలపడతాయి. కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. చేపట్టిన పనులలో ఇతరుల నుంచి స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి నిలదొక్కుకుంటారు.
 
మకరం: - ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కుంభం:- కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. భాది, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక కార్యం నిమిత్తం ఆరస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
మీనం:- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ బడ్జెట్ కు భిన్నంగా ఉంటాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసివస్తుంది. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు