శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-01-2022 శనివారం దినఫలాలు - లక్ష్మీనారాయణస్వామిని ఎర్రని పూలతో...

మేషం :- శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ద వహించండి. స్త్రీలు తమ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులకు సంతృప్తి కానస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. రావలసిన ధనం చేతికందడంతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
కర్కాటకం :- నూతన వాతావరణం, కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విదేశీ యత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ధన వ్యయం అధికంగా ఉన్నా ఖర్చులు ఇబ్బంది అనిపించదు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా కొనసాగుతాయి. నూతన వ్యక్తులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు.
 
సింహం :- మీ సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు దైవ, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది.
 
కన్య :- రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ శ్రీమతి ఇచ్చిన సలహా తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్లమానసిక ప్రశాంతత చేకూరుతుంది. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
తుల :- బంధు మిత్రుల రాక మీకు ఆందాన్ని కలిగిస్తుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అనవసరం.
 
వృశ్చికం :- విద్యార్థులు తోటి విద్యార్థులతో విందులు, వేడుకలలో పాల్గొంటారు. మనుషుల మనస్తత్వం తెలిసి మసలు కొనుట మంచిది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. బంధువులరాకతో గృహంలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ ఆలోచనలు కార్య రూపం దాల్చి అనుకున్నది సాధిస్తారు.
 
ధనస్సు :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ధనాదాయం బాగున్నా గృహంలో శుభకార్యల వల్ల ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విదేశాలలో ఉన్న వారికి శుభాకాంక్షలు అందజేస్తారు.
 
మకరం :- వస్త్ర,పచారీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. ఉపాధ్యాయులకు సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవశాలు కలిసివస్తాయి.
 
కుంభం :- పంతాలకు పోకుండా బంధువులతో ఆదరంగా మెలగండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఎటువంటి స్వారచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు పార్టీ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణ బాధలు తొలగిపోతాయి ప్రశాంత చేకూరుతుంది. విద్యుత్ బిల్లలు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.