శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-01-2022 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...

మేషం :- ఉద్యోగస్తులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్పెక్యులేషన్, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
 
మిధునం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారి వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు ఉపకరిస్తాయి.
 
కర్కాటకం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రతికూలతలెదురవుతాయి. మీ సంతానం ఆరోగ్యంలో మెలకువ వహించండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక సమాచారం సేకరణకు శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహించండి. కొంత మంది వ్యక్తులు మీ పలుకుబడిని స్వార్థానికి వినియోగించుకుంటారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం వల్ల ఆర్థిక ఇబ్బందులుండవు.
 
కన్య :- విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు చేపడతారు. స్త్రీలు ఆధిపత్యం చెలాయించి భంగపాటుకు గురవుతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
 
తుల :- లీజు, నూతన పెట్టుబడులు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ఖర్చులు అధికం కావటంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. నిర్మాణ పనుల్లో పనివారల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
వృశ్చికం :- వస్త్రాలు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. దైవ, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనులు అనుకూలం. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
ధనస్సు :- విదేశీయానం కోసం చేసే యత్నాలలో ఆటంకాలు ఎదుర్కుంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అండగా నిలుస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం :- భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయటం క్షేమదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పత్రిక, నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విందులు, వినోదాల్లో హుందాగా మెలిగి అందరినీ ఆకట్టుకుంటారు. బంధు మిత్రులతో ఆంనందంగా గడుపుతారు.
 
కుంభం :- స్త్రీలు భేషజాలు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి, వస్త్రలాభం వంటి శుభఫలితాలుంటాయి. మీ మాటకు ఇంటా బయట ఆదరణ లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు తొలగిపోతాయి. మీ సంతానం విద్యావిషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మీనం :- తల పెట్టిన పనులు వాయిదా వేయవలసి వస్తుంది. ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులు భారీగా ఉంటాయి. విద్యార్థులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీసములు సానుకూలమవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్వల్ప చికాకులు మినహా సమస్యలు పెద్దగా ఉండవు.