సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-01-2022 శనివారం రాశిఫలితాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

మేషం :- మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి.
 
వృషభం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పొందగలవు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
మిథునం :- బేకరి, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. ప్రైవేటు రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం. బ్యాంకు వ్యవహారాలలో ధనం పట్ల, అపరిచితులతో మెళుకువ అవసరం. కోల్పోయిన అవకాశం, వస్తువులు చేజిక్కుంచుకుంటారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్వీట్ షాపు వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులకు అనుకోని చికాకులు ఎదురవుతాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
సింహం :- స్త్రీలకు ప్రతివిషయంలో ఓర్పు, నేర్పు అవసరమని గమనించండి. ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
 
కన్య :- కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. బంధువులరాక వల్ల మానసికాందోళన తప్పదు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు.
 
తుల :- ఇతరుల కారణంగా మీ పనులు, కార్యక్రమాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు అందించడం వలన కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్ ఫలితాల నిస్తుంది. ధనం చేతిలో నిలబడటం కష్టంకావచ్చు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
ధనస్సు :- ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. శతృవులపై విజయం సాధిస్తారు. సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కార దిశగా పయినిస్తాయి.
 
మకరం :- వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. కొత్త అనుభవం ఎదురైనందుకు ఆనందించండి.
 
కుంభం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాతావరణంలోని మార్పులు వల్లమీ పనులు వాయిదా పడతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పని పట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వ్యాపారభివృద్ధికి బాగా శ్రమిస్తారు.
 
మీనం :- వ్యాసాగాలు మరింతగా పుంజుకుంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది.