1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జులై 2025 (21:13 IST)

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Garuda Panchami
Garuda Panchami
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి జన్మించిది కనుక సర్పభయం లేకుండా ఉండడం కోసం ఈ రోజంతా నాగపూజలు చేస్తుంటారు. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. కద్రువకు సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగ పంచమిగా పిలుబడుతోంది. 
 
అలాగే ఇదే రోజున గరుడ పంచమిగా చెప్పబడుతున్న ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది. 
 
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది. 
 
సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది. అలా తన 
తల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. 
 
సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది. 
 
పురాణాల ప్రకారం, ఒక వ్యక్తిని అన్ని రకాల నాగదోషం (పాము బాధలు) నుండి ఉపశమనానికి గరుడుడు శక్తిమంతుడు. కేవలం మంత్రోచ్ఛారణలతోనే ప్రసన్నుడవుతాడు. గరుడ గాయత్రి, గరుడ వశీకరణం, గరుడ దండకం  గరుడ కవచం వంటి గరుడుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలను రోజూ 108 సార్లు జపిస్తే గరుడుని అనుగ్రహం లభిస్తుంది.
 
ఈ గరుడ మంత్రాలన్నీ ఈ కలియుగంలో చాలా శక్తివంతమైన మంత్రాలు. ఈ మంత్రాన్ని 1008 సార్లు.. 108 రోజులు జపిస్తే, అంటే శుక్ల పక్ష పంచమి తిథి.. గరుడ పంచమి రోజున ప్రారంభిస్తే చాలా శుభప్రదం. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
Garuda Panchami
Garuda Panchami
 
అలాగే 12 తరాల వరకు అన్ని రకాల సర్ప దోషాలు (కాల సర్ప దోషాలు), నాగ దోషాలు, రాహు దోషాలు, కేతు దోషాలు, దురదృష్టాల నుండి విముక్తి పొందగలరని విశ్వాసం. మంచి ఆరోగ్యం, సమృద్ధి, సంపద, సంతోషకరమైన వివాహ జీవితం, సత్ సంతానం ప్రసాదించగలడని విశ్వాసం.