సంబంధిత వార్తలు
- Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్
- Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?
- Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?
- How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?
- Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్
Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?
Vishnu Sahasranamam
విష్ణు సహస్రనామమును పఠించలేని వారు రామ రామ రామ అని మూడు మార్లు పలికితే విష్ణుసహస్ర నామము పఠించినంత ఫలితము వస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. విష్ణు సహస్రనామం పఠనంతో సకల పాపాలు పోయి పవిత్రులౌతారు. కోరిన కోరికలన్నీ ఫలిస్తుంది.
దీనికి మించిన మంత్రము లేదు. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి విష్ణు సహస్రనామం. అంటే వెయ్యి పేర్లను చెప్పి విష్ణువును స్తుతించే మంత్రం. దీన్ని ప్రతిరోజూ పఠిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. వాటిలో చాలా ముఖ్యమైన కొన్ని ఫలితాలు గురించి తెలుసుకోవచ్చు.
విష్ణు సహస్రనామాన్ని ఉచ్ఛరించడం లేదా వినడం ద్వారా మనశ్శాంతి చేకూరుతుంది. రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, భయం వంటి ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఇంకా స్పష్టమైన ఆలోచనలు, మన ప్రశాంతత వంటివి అందిస్తుంది.
Vishnu Sahasranamam
అనేక శతాబ్దాలుగా, విష్ణు సహస్రనామం వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పారాయణం చేయడం వల్ల శరీర ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
విష్ణు భగవానుడు శ్రీలక్ష్మి పతి కావడంతో ఆయనను స్తుతించే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ మంత్రం సంపదను ఆకర్షిస్తుంది. అష్టైశ్వర్యాలు చేకూరడంతో పాటు జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేలా చేస్తుంది. జీవితంలో అడ్డంకులను తొలగించి, కొత్త అవకాశాలను సృష్టించడం చేస్తుంది.
Vishnu Sahasranamam
గతంలో తెలిసీతెలియక చేసిన పాపాలకు విముక్తి లభించాలంటే.. విష్ణు సహస్రనామం పఠించాలి. దీనిని పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఇంకా విష్ణు సహస్రనామ పఠనంతో ఆధ్యాత్మిక అభివృద్ధి, జ్ఞానం పెంపొందుతుంది. శత్రు భయం వుండదు. దుష్ట శక్తులు దరిచేరవు.
వివాహ అడ్డంకులు తొలగిపోవడం, సత్సంబంధాలు చేకూరుతాయి. మరణ భయం వుండదు. ఇంకా మోక్షం సిద్ధిస్తుంది. ప్రతికూల ఇబ్బందులు తొలగి అదృష్టం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.
