శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:10 IST)

"చింతామణి"పై సర్కారుకు షాక్.. పుస్తకంపై నిషేధం లేదుకదా? హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చింతామణి వీధి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాటకంలో ఒక పాత్ర బాగోలేనంత మాత్రాన మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని కోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనపుడు నాటక ప్రదర్శనపై ఎలా నిషేధం విధిస్తారని హైకర్టు ప్రశ్నించింది. 
 
దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, ప్రభుత్వానికి వచ్చిన వినతుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.