మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (12:36 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై స్పష్టతనిచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. 
 
"రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం తేల్చి చెప్పింది. మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్టణం, జ్యూడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. ప్రస్తుతం మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే" అని ఆయన స్పష్టం చేశారు.