ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ఏపీ హైకోర్టు నియమించిన అప్పీలేట్ అథారిటీ నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె షెడ్యూల్ తెగకు చెందిన మహిళేనని స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాదంటూ హైకోర్టులో రేగు మహేశ్వర రావు అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఆమె కులానికి చెందిన వారో నిర్థారణ చేయాలంటూ అప్పీలేట్ అథారిటీని ఆదేశించింది.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన అప్పీలేట్ అథారిటీ పుష్ప శ్రీవాణి షెడ్యూల్ తెగల్లో ఒకటైన కొండదొర సామాజిక వర్గానికి చెందిన వారని నిర్ధారించింది. దీంతో ఆమె భారీ ఊరట లభించింది. ప్రస్తుతం ఈమె ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న విషయం తెల్సిందే.