సంబంధిత వార్తలు
- ఎన్టీఆర్ గార్డెన్స్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం: కేటీఆర్
- కేంద్ర ఆర్థిక బడ్జెట్‌పై కేటీఆర్ ఫైర్: తెలంగాణపై సవతి తల్లి ప్రేమ
- పనికిమాలిన బడ్జెట్ - దేశానికి మేలు జరగదు : రేవంత్ రెడ్డి
- మాటల్లోనే.. చేతల్లో ఎక్కడ? కేంద్రంపై మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్
- కొత్త శ్రీనివాస్ 2022 క్యాలెండరును ఆవిష్కరించిన కేటీఆర్
కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ- గులాబీ నేతలను ఎందుకు పట్టించుకోరు..?
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవన్నారు రేవంత్. గులాబీ నేతల అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఇదంతా మీకు చేతకాకనా.. లేక అందులో వాటాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు.
జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పారు రేవంత్. అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారని.. ఇది అంత ఆషామాషీ విషయమా? అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు.
దేవరయాంజల్ 437 సర్వే నెంబర్‌లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి పత్రికలు నడుపుతున్నారని కేటీఆర్‌కు గుర్తు చేశారు రేవంత్. ఇలా గ్రేటర్‌లో గులాబీ నేతల కబ్జాలు కోకొల్లలని వివరించారు.
తర్వాతి కథనం
