మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (16:15 IST)

అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అటు గాయాలైన వారికీ మెరుగైన చికిత్స అందించాలని మోదీ కోరారు.
 
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లిబృందం సభ్యులతో వెళుతున్న ఇన్నోవా కారును లారీ ఢీకొనడంతో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.