శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:03 IST)

పవన్‌పై వైసీపీ నేత సజ్జల ఫైర్: ఆ వ్యవహారంపై ఎందుకు స్పందించలేదు..

ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంభిస్తుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్‌పై వైసీపీ నేత సజ్జల మండిపడ్డారు. 
 
టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల వ్యవహారంలో ఆధిపత్య ధోరణి పదం బాగుందని వాడినట్లు వున్నారని పవన్‌ను హెచ్చరించారు. 
 
చర్చల్లో ఆధిపత్య ధోరణి అనటానికి అర్థం ఏమైనా ఉందా? మేం అమరావతి భూములను తాకట్టు మాత్రమే పెడుతున్నాం… టీడీపీ ఏకంగా వేలాది ఎకరాల భూములను అమ్మాలని పాలసీ గానే పెట్టుకుందన్నారు.