సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:06 IST)

లిప్‌లాక్ గురించి ర‌వితేజ ఏమంటున్నాడో తెలుసా!

Ravi Teja, Meenakshi
తెలుగు సినిమా క‌థ‌లు, పోక‌డ‌లు మారిపోతున్నాయి. ఒక‌ప్ప‌టి హీరోయిన్లు ఇప్ప‌టి హీరోయిన్ల‌కు చాలా తేడావుంది. ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు ప‌బ్ సీన్స్‌, ప‌డ‌క సీన్స్ కూడా చేసేస్తున్నారు. ఆమ‌ధ్య ర‌వితేజ సినిమాలో శ్రుతిహాస‌న్ కూడా బెడ్‌పై త‌న భ‌ర్త ర‌వితేజ‌తో కింద‌మీద ప‌డుకుని ఓ పాట‌ను కూడా చేసేసింది. ఇప్పుడు తాజాగా లిప్‌కిస్‌లు కామ‌ని తాజాగా ర‌వితేజ సినిమాలో న‌టిస్తున్న మీనాక్షి చౌద‌రి స్ప‌ష్టం చేసింది. ఆర్టిస్టుగా ట్రైనింగ్‌లో ఇవ‌న్నీ చేయాల‌ని వుంద‌నీ, కానీ క‌థ ప్ర‌కారం న‌డ‌చుకోవాల‌ని సూక్తి చెప్పింది.
 
ఇక మన్మధుడు 2 లో నాగార్జున, కుర్ర హీరోయిన్ అక్షర లిప్ లాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ట్రెండ్‌తో ఇప్ప‌టి యూత్ హీరోలు ఏదో సంద‌ర్భంలో లిప్‌కిస్‌లు చూసుకుంటున్నారు. వ‌రుడు సినిమాలో అల్లు అర్జున్ కూడా లిప్ కిస్ పెట్టాడు. మ‌హేష్‌బాబు ఇంకా ప‌లువురుకూడా ఇటువంటి స‌న్నివేశాలు వుండేలా చూశారు. ఇందుకు ద‌ర్శ‌కులు కూడా దోహ‌ద‌ప‌డ్డారు. ఈ విష‌య‌మై ఖిలాడి సినిమాలో ర‌వితేజ‌, మీనాక్షి చౌద‌రి లిక్ కిస్ ట్రైల‌ర్లో చూపించారు. దీనిపై ఇప్ప‌టికే మీనాక్షి క్లారిటీ ఇచ్చింది. ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఈ విష‌య‌మై తెలుపుతూ, ఇది క‌థ ప్ర‌కార‌మే వుంటుంది. ఎక్క‌డా అస‌భ్య‌త వుండ‌దు. ప్రేయ‌సి ప్రియుడు భార్య‌భ‌ర్త‌ల‌మ‌ధ్య జ‌రిగే రొమాంటిక్ స‌న్నివేశం ఇది అన్నారు.

మ‌రి ర‌వితేజ  ఈ సీన్ చెప్పిన‌ప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారంటే. మొద‌ట్లో అవ‌స‌ర‌మా! ఇది డైరెక్ట‌ర్ గారూ.. ఒక‌సారి ఆలోచిచండి.. అన్నారు. కానీ స‌న్నివేశ‌ప‌రంగా అలా వుంటేనే బాగుంటుంద‌ని చెప్ప‌డంతో ఆయ‌న చేశారు. దీనిపై సెన్సార్ కూడా పెద్ద‌గా అబ్యంత‌రం చెప్ప‌లేద‌ని తెలిపాడు. మ‌రి సీనియ‌ర్ హీరోలు కూడా హీరోయిన్ల‌తో ఇలా లిప్‌లాక్ వుండేలా ద‌ర్శ‌కుల‌ను కోరుతున్న‌ట్లు సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.