రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)
సోషల్ మీడియాలో రోజువారీ ఎన్నో వీడియోలు షేర్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇపుడొకటి హల్చల్ చేస్తోంది. కట్టేసి వున్న గుర్రాన్ని చుట్టుముట్టాయి వీధి కుక్కలు. ఓ కుక్క గుర్రం తోకను పట్టుకుని గుంజుతోంది. ఆ కుక్క అలా చేస్తుండగా మరో రెండు కుక్కలు వచ్చేసాయి. తోకను గుంజుతున్న కుక్కతో మరో కుక్క తోడైంది.
అది కూడా గుర్రం తోకను పట్టుకుని పీకడం మొదలుపెట్టింది. అంతకుముందువరకూ ఎంతో ఓపికగా ఓర్చుకున్న గుర్రం కాస్తా ఆగ్రహంతో వెనుక కాళ్లు రెండింటినీ పైకెత్తి లాగి ఒక్కటిచ్చింది. అంతే... కుయ్యో అంటూ కుక్కలు అక్కడి నుంచి పరార్.