మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:19 IST)

ఐటెం సాంగ్ కు రెడీ కానీ .. - డింపుల్ హ‌యాతీ

Dimple Hayati
విశాల్‌తో సామాన్యుడు సినిమాలో నాయిక‌గా న‌టించిన డింపుల్ హ‌యాతీ అంత‌కుముందు ఐటెం సాంగ్ చేసింది. ర‌వితేజ సినిమా ఆడిష‌న్‌కు వెళ్ళాక ద‌ర్శ‌కుడు ఆమెను  ఒక హారోయిన్‌గా సెలెక్ట్ చేశాడు. అయితే ర‌వితేజ ఈమె ఫొటో చూసి ఈమె గ‌ద్దెల‌కొండ‌..లో ఐటం సాంగ్ చేసింద‌ని బ‌య‌ట పెట్టాడు. దాంతో అప్ప‌టివ‌ర‌కు తెలీని విష‌యం యూనిట్‌కు తెలిసిపోయింది అని డింపుల్ చెబుతోంది.
 
ఐటం సాంగ్ వ‌ల్ల మంచి పేరు వ‌స్తుంది. రెమ్య‌న‌రేష‌న్ కూడా వుంటుంది. ఆ  ఐటం సాంగ్ త‌ర్వాత ఆ త‌ర‌హాలో చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ అవ‌న్నీ వ‌ద్ద‌నుకున్నా. ఎందుకంటే కెరీర్ మొద‌టిలోనే డాన్స‌ర్‌గా మార‌డం ఇష్టంలేదు. చాలా కాలం ఆలోచించి న‌టిగా నిరూపించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఆ టైంలో ఖిలాడి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని తెలిపింది. స‌మంత ఐటం సాంగ్ చేసింది. నేనూ భ‌విష్య‌త్‌లో చేస్తాను. అప్ప‌టివ‌ర‌కు న‌టిగా పేరు తెచ్చుకుంటాన‌ని న‌మ్మ‌కంగా చెబుతోంది.