భీమ్లా నాయక్ కథను పూర్తిగా మార్చేసిన పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్. దీని మాతృక మలయాళంలోని అయ్యప్పన్ కోషియమ్. దాన్ని యదాతథంగా తీస్తే తెలుగు ప్రేక్షకులకు రుచిందని ఈ చిత్రను పూర్తిగా మార్చేసినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇద్దరు ఇగోయిస్టుల మధ్య జరిగేవారే ఈ సినిమా. ఒకరు పోలీసు ఆఫీసర్ అయితే మరొకరు చిత్ర హీరో. అతనే రానా. ఈ కేరెక్టర్లు అలాగే వుంచారు. వారి మధ్య వచ్చే సమస్యను పూర్తిగా తెలుగు నేటివిటీకి మార్చేశారు. నగ్జలైట్ వ్యవస్థకు, సామాన్యులకు, పోలీసు వ్యవస్థకు మధ్య జరిగే సున్నితమైన అంశాన్ని ఇందులో పొందుపర్చినట్లు తెలిసింది.
ముఖ్యంగా మహిళా సమస్యలను ఇందులో చూపించనున్నారు. నగ్జలైట్లో మహిళలు ఏ విధంగా త్యాగాలు చేసి పోరాడుతుంటారు. ఎందుకు పోరాడుతుంటారు? ఆ తర్వాత బయటకు వచ్చాక వారి పరిస్థితి ఏమిటి? అనేది మలయాళ సినిమాలో అంతగా చూపించలేదు. కానీ భీమ్లా నాయక్ లో పూర్తిగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ మహిళకు ఇచ్చిన మాట ప్రకారం భీమ్లా నాయక్ ఏమి చేశాడనేది హార్ట్ టచింగ్ గా వుంటుందని తెలుస్తోంది. మహిళ ఏ రంగంలోవున్నాహక్కులు కాలరాయకూడదనే డైలాగ్‌లు బాగా ఆలోచింపజేసేవిగా వుంటాయని తెలుస్తోంది.
తాజా సమాచారం మేరకు పవన్ డబ్బింగ్ కొద్దిగా పెండింగ్ వుండడంతో నిన్న రాత్రి లేట్ అయినా పూర్తిచేసి వెళ్లాడని తెలిసింది. ఈ నెల 25న సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర పనులు వివిధ లొకేషన్లలో జరుగుతున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. థమన్ సంగీతం అందించారు.