గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పవన్ చిత్రానికి తప్పని లీకుల బెడద... "భీమ్లా నాయక్" నుంచి డ్యాన్స్ బీట్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి కూడా లీకుల బెడద తప్పలేదు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "భీమ్లా నాయక్‌"లోని ఓ పాటకు సంబంధించిన డ్యాన్స్ స్టెప్పుల ఫోటోలు (డ్యాన్స్ బీట్) సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
కొత్త చిత్రాల్లోని పాటలు, డ్యాన్స్ బీట్స్, ఇతర సన్నివేశాలు లీక్ కాకుండా మరింతగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో ఈ ఆడియో సాంగ్ విడుదల కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 
 
ఇదిలావుంటే, హీరో మహేష్ బాబు నటించిన "సర్కారువారి పాట" చిత్రంలోని కళావతి పూర్తి సాంగ్‌ను ఇంటర్నెట్‌లో లీక్ చేసిన విషయం తెల్సిందే. ఈ పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేసేలా చిత్రబృందం చర్యలు తీసుకుంది. కానీ, ఆ చిత్రం కోసం పని చేసిన ఓ టెక్నీషియన్ ముందుగానే ఈ సాంగ్‌ను రిలీజ్ చేసి దర్శకనిర్మాతలకు షాకిచ్చారు.