ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (11:21 IST)

విశాఖలో 'డీజే టిల్లు' సక్సెస్ మీట్

ఇటీవల విడుదల చిత్రం "డీజే టిల్లు". ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించాయి. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించింది. 
 
ఇందులో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, "డీజే టిల్లు ప్రేక్షకులకు అంతబాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వైజాగా సిటీ నాకు ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచే మొదలైంది. మరో చిత్రం సినిమా షూటింగ్ కోసం ఇక్కడ ఉండగా, 'డీజే టిల్లు' సినిమా ఆఫర్ వచ్చింది. నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని రాధిక పాత్రను నాకిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అని చెప్పారు. 
 
ఆ తర్వాత దర్శకుడు విమల్ మాట్లాడుతూ, 'డీజే టిల్లు'ను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు.. ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు' అని చెప్పారు.