సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (18:12 IST)

విజ‌య‌యాత్ర‌లో డిజె టిల్లు టీమ్ కు నీరాజ‌నాలు

Vimal Krishna, Sidhu Jonnalagadda, Neha Shetty
అప్పటి వరకు సినిమా చూస్తూ తెరమీద నాయకా నాయికలు ను, వారి నటనను చూస్తు, నవ్వులతో మునిగి పోయిన వారికి అంతలోనే చిత్ర నాయక, నాయికలు ఎదురయ్యే సరికి వారి ఆనందం తో ధియేటర్ మారుమ్రోగింది. ఈ సంఘటన విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ లో జరిగింది. 'డిజె టిల్లు'టీం ధియేటర్లో ఈరోజు సందండి చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ శుక్రవారం విడ‌ద‌ల‌యిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ డిజె టిల్లు టీం విజ‌య‌యాత్ర లో భాగంగా విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ ని సంద‌ర్శించారు. ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూసిన టీం త‌మ ఆనందాన్ని ప్రేక్ష‌కుల‌తోనూ మీడియాతో నూ పంచుకున్నారు. 'డిజె టిల్లు' అంటూ ప్రేక్ష‌కుల అరుపుల‌తో ధియేటర్ మరింత  జోష్ ని నింపుకుంది..
 
ఈసంద‌ర్భంగా  హీరో సిద్దు జోన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ...'తెలంగాణా యాస తో వ‌స్తున్నాం ఎలా ఉంటుంది ఈ సినిమా నైజాం వ‌ర‌కూ మాకు ఎలాంటి సందేహాలు లేవు..కానీ ఆంధ్ర‌లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజ‌యవాడ‌లో ఆడియ‌న్స్ తో క‌ల‌సి చూసాక మంచి సినిమా ఎక్క‌డైనా మంచి సినిమానే అని ప్రేక్ష‌కులు రుజువు చేసారు. చాలా ఆనందంగా ఉంది. డిజె టిల్లు అనే క్యారెక్ట‌ర్ రాయ‌డం,చేయ‌డం ఒక క‌త్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్ష‌కులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజ‌యం అందించారు. ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన కిక్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మిమ్మ‌ల్ని ఏడిపించేంత న‌వ్విస్తాడు టిల్లు దానికి నాది గ్యారెంటీ అన్నారు.
 
ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ మాట్లాడుతూ..'ఈ విజ‌యం తో ఏం మాట్లాడాలో అర్దం కావ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌కు చాలా థ్యాంక్స్. మా న‌మ్మ‌కాన్ని ప‌దింత‌లు చేసి ప్రేక్ష‌కులు మాకు విజ‌యం అందించారు. ఈ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేయ‌డంలోనూ సిద్దూ పాత్ర చాలా ఉంది. విజ‌య‌వాడ  లో ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఆనందాన్ని ప‌దింత‌లు చేసింది అన్నారు.
 
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ...'నా మొద‌టి థియేట‌ర్ విజిట్ ఇది. నా సినిమా ఆడియ‌న్స్ తో చూడ‌టం ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. థియేట‌ర్ లో రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.  డిజె టిల్లు ఒక సూప‌ర్ ఫ‌న్ రైడ్ .. ప్రేక్ష‌కులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అన్నారు. ప్రేక్షకాభిమానుల ఆనందాన్ని తమ గుండెల్లో నింపుకొని మరిన్ని ధియేటర్ ల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించింది చిత్ర యూనిట్.