మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (17:00 IST)

రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ సినిమాలోని క్రేజీ పాయింట్ అదే!

charan- Sankar movie poster
ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమాలంటే ప్ర‌భుత్వాల తీరును ఎండ‌గ‌ట్టే విధంగా వుంటాయి. అందులో ప్ర‌జ‌ల బాధ్య‌త ఏమిటో కూడా చూపిస్తుంటాయి. అప‌రిచితుడులో అటువంటి అంశాలు బాగానే వున్నాయి. తాజాగా రామ్‌చ‌ర‌న్‌తో ఆయ‌న చేస్తున్న సినిమా కూడా పొలిటిక‌ల్ ట‌చ్‌తో వుంటుంద‌ని తెలుస్తోంది. ఇందులో ప్ర‌ముఖ తారాగ‌ణం కూడా న‌టిస్తోంది. 
 
ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్‌లో ప్ర‌ముఖ న‌టీన‌టులంతా పాల్గొన‌గా పూర్తి చేశారు. కాగా, ఈ సినిమాకు టైటిల్‌కు ఖ‌రారుచేనే ప‌నిలో చిత్ర యూనిట్ వుంది. ఈ చిత్రానికి `సర్కారోడు  అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు చేస్తున్న సినిమాకు స‌ర్కారువారి పాట టైటిల్ వుంంది. ఆయ‌న బ్యాంకింగ్ కుంభ‌కోణాన్ని ట‌చ్ చేస్తే, శంక‌ర్ అంత‌కుమించి వున్న అంశాన్ని ఇందులో చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది. సూటుబూటు వేసుకున్న పోస్ట‌ర్ల‌ను ఆమ‌ధ్య శంక‌ర్ విడుద‌ల చేశారు. పొలిటీష‌న్ల‌కు స‌ల‌హాయిచ్చే అధికారుల నేప‌థ్యంలో ఈ చిత్రం వుంటుంద‌ని స‌మాచారం.