శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (15:27 IST)

పవన్ కళ్యాణ్‌కి తిక్కుంది, ఐతే దానికో లెక్కే లేదు: సీపీఐ నారాయణ సెటైర్లు

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ కి తిక్కుంది కానీ దానికి లెక్కే లేదంటూ ఎద్దేవా చేసారు. మొన్నటి సభలో తన కార్యకర్తలను అయోమయంలోకి నెట్టేసారు పవన్ అంటూ విమర్శించారు.

 
భాజపా-వైసిపి పెళ్లి కాకుండా కాపురం చేస్తున్నారంటూ విమర్శించిన నారాయణ పవన్ కళ్యాణ్ కూడా ఆ రెండు పార్టీల మధ్యన చొరబడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి ప్రణాళికలు వుంటే చెప్పే చేయవచ్చని, డొంక తిరుగుడు వ్యాఖ్యలు ఎందుకు అంటూ విమర్శించారు.

 
పవన్ కళ్యాణ్ కు తాము వ్యతిరేకం కాదనీ, ఐతే ఆయన నిలకడ లేకుండా తీసుకునే నిర్ణయాలపైనే వ్యతిరేకమని నారాయణ అన్నారు.