1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Raghuramaraju interesting comments on Pawan kalyan

పవన్ కల్యాణ్‌ ఉద్దేశం అదేనేమో: RRR

Raghuramaraju
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలన్నారు. పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని రఘురామరాజు అభిప్రాయపడ్డారు. 
 
"వ్యతిరేక ఓట్లు చీల్చనని పవన్‌ చెప్పారు. బలమైన ప్రతిపక్షాలు కలవాలి. ఇప్పటికే భాజపాతో కలిసి ఉన్నారు. పవన్‌ ఉద్దేశం ప్రకారం తెదేపాతో కలవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్‌ ఉద్దేశం." అన్నారు రఘురామరాజు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్.. తెలంగాణలో 17.23 లక్షల మందికి..?