బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (13:33 IST)

తెలుగు రాష్ట్రాల్లో "భీమ్లా నాయక్‌"కు బ్రహ్మరథం - కలెక్షన్ల వర్షం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు హీరో, విలన్లుగా నటించిన చిత్రం "భీమ్లా నాయక్". సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాని త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం గత నెల 25వ తేదీన విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో తొలి వారంలోనే ఏకంగా 170.74 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టింది. 
 
రెండో వారంలో ఈ కలెక్షన్ల సంఖ్య 16.30గా వుంది. ఇప్పటివరకు ఈ కలెక్షన్ల సంఖ్య మొత్తం 192.04 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అయితే, ఈ వారాంతానికి ఈ కలెక్షన్ల సంఖ్య రూ.200 కోట్లకు చేరుకుంటుందా లేదా అన్న సందేహం నెలకొనివుంది. 
 
మొదటి వారంలో రూ.170.74 కోట్లు, రెండో వారంలో రూ.16.30 కోట్లు, మూడో వారం మొదటి రోజు రూ.1.39 కోట్లు, రెండో రోజు రూ.1.54 కోట్లు, మూడో రోజు రూ.1.67 కోట్లు, నాలుగో రోజు రూ.0.40 కోట్లు చొప్పున మొత్తం 19 రోజుల్లో ఏకంగా ఈ సినిమా రూ.192.04 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది.