ఎఫ్ 3 సెట్‌లో అల్లు అర్జున్... ఫోటోలు నెట్టింట వైరల్
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
ఈ తరుణంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎఫ్ 2 సినిమాలోని హీరోయిన్లనే ఈ సినిమాలోనూ తీసుకున్నాడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సడన్‌గా సెట్‌ను విజిట్ చేశాడు. పుష్ప హీరో అల్లు అర్జున్. వరుణ్ తేజ్‌తో పాటు పలువురు స్టార్‌లతో కలిసి కాసేపు ముచ్చటించారు ఈ పుష్ప రాజ్.
దీనికి సంబంధించిన ఫోటోలను విక్టరీ వెంకటేష్, వరుణ్ సందేశ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా ఎఫ్ 3 సినిమా.. విడుదల తేదీపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే విడుదల తేదీని ఈ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.