బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (21:08 IST)

ఎఫ్‌3కి క‌రోనా ఎఫెక్ట్- ఆందోళ‌న‌లో సినీప్ర‌ముఖులు‌

Director anil
క‌రోనా వైర‌స్ మ‌ర‌లా విజృంభించ‌డంతో షూటింగ్‌లు కూడా వాయిదా ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. తాజాగా సినిమా ప్ర‌ముఖుల‌కు క‌రోనా పాజిటివ్ సోకుతోంది. ఈరోజే సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. నిన్న‌నే ఆయ‌న ఆచార్య షూటింగ్‌లో సైకిల్‌పై వెళ్ళి పాల్గొన్నాడు. ఇక ఆయ‌న బాట‌లో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వున్నారు. అయితే కొంద‌రు బ‌హిరంగంగా చెబుతున్నారు. 
 
దిల్‌రాజుకు నెగెటివ్‌
 
ఇటీవ‌లే నిర్మాత దిల్‌రాజుకు క‌రోనా పాజిటివ్ అని రాగానే ఆయ‌న గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జాగ్ర‌త్త‌లు తీసుకున్నాక శ‌నివారంనాడు బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చానన‌ని పేర్కొన్నారు. 
 
అనిల్ రావిపూడికి క‌రోనా
 
ఈరోజు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి కోవిడ్ -19 పాజిటివ్. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా తెలిపారు. ఇప్పుడు అనిల్ ఎఫ్ 3 షూటింగ్ ప్రస్తుతానికి పోస్ట్ ఫోన్ చేశారు. ఇక అనిల్ తో సన్నిహితంగా ఉన్న మిగిలిన నటీనటులు కూడా తమ షూటింగ్స్ ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.