సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:30 IST)

తెదేపా శ్రేణుల్లో ఆందోళన.. చంద్రబాబుతో ఉన్న నేతకు కరోనా????

తెలుగుశం పార్టీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. శ్రీకాళహస్తి పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో, ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నెల 8న శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. 
 
ముఖానికి మాస్క్ ధరించకుండానే చంద్రబాబుతో సుధీర్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయన పక్కనే నిల్చొన్నారు. ఇప్పుడు ఆయన కరోనా బారినపడటంతో... చంద్రబాబు గురించి పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు ఈ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది.