గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:12 IST)

కోవిడ్ టీకా వేసుకున్న టిటిడి ఈఓ, ప్రతి ఒక్కరు వేసుకోవాలంటూ..

కోవిడ్ టీకా వేసుకున్న టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలోని కేంద్రీయ వైద్యశాలలో కోవిడ్ టీకా వేయించుకున్నారు. అనంతరం వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
 
ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ఇరుమల శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, స్థానిక ఆలయాల్లో పనిచేసే ఫ్రంట్ లైన్ సిబ్బందికి ఇది వరకు కోవిడ్ టీకాలు వేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్సకాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 యేళ్ళు పైబడిన ఉద్యోగులందరికీ టీకా వేయించాలని అధికారులను ఆదేశించారు. 
 
తాను కూడా ఈరోజు కోవ్యాక్జిన్ మొదటి డోసు కూడా వేసుకుని సర్టిఫికెట్ పొందానని, 4 వారాల నుంచి 6 వారాల మధ్య రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది వరకు టీకాలు వేయించుకున్న టిటిడి సిబ్బంది సమయానుసారంగా రెండో డోసు వేసుకోవాలని సూచించారు.