సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:54 IST)

దేశంలో కరోనా అప్డేట్స్... కొత్తగా 1.26 లక్షల కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ తీవ్ర స్థాయిలో ఉంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంటల్లో 1,26,789 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
వాటి ప్రకారం... నిన్న‌ 59,258  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 685 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,66,862 కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,18,51,393 మంది కోలుకున్నారు. 9,10,319  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా  9,01,98,673 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,26,77,379 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 12,37,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 2,055 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 303 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,741గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 13,362 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,263 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.