గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (14:18 IST)

విరాట్ కోహ్లీని ఎత్తిపడేసిన అనుష్క శర్మ.. నెట్టింట వీడియో వైరల్

Kohli_Anushka
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఏది చేసినా అది వైరలే. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియోలు కూడా గతంలో వైరల్ అయిన దాఖలాలున్నాయి. తాజాగా విరుష్క జోడీకి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..? అనుష్క.. కోహ్లీ ఎత్తి పక్కనపడేసింది. 
 
అనుష్క ఈ ఏడాది జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాపకు వామికగా నామకరణం చేశారు. ఇక ఆర్సీబీ కెప్టెన్‌ అయిన, కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌-2021 టోర్నీతో బిజీగా ఉండగా, అనుష్క సినిమాలపై దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ సెట్‌కు వచ్చిన కోహ్లీని అనుష్క పైకెత్తింది. ఆపై కింద దింపేసింది. సాధారణం ప్రసవానంతరం మహిళలు బరువు ఎత్తేందుకు సాహసించరు. 
 
అలాంటిది కోహ్లీని అనుష్క ఎత్తేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను చూస్తే విరుష్క జోడీ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తప్పక చెప్పవచ్చు. తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో భర్త కోహ్లిని అనుష్క ఎత్తుకున్నారు. వీడియోను వీక్షించిన అభిమానులు.. ‘‘సూపర్‌ అనుష్క.. మీ జంట ఎల్లప్పుడూ కలిసి ఉంటూ, మాకు ఇలాగే వినోదం పంచుతూ ఉండాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు.