మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (11:02 IST)

కోహ్లీకి డేవిడ్ లాయిడ్ వార్నింగ్.. పసుపు, ఎర్ర కార్డులు ఇవ్వాలి.. లేకుంటే..?

టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఇంగ్లీష్ జట్టు మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ హెచ్చరించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ల సందర్భంగా టీమ్‌ఇండియా సారథి అంపైర్లకు గౌరవం ఇవ్వట్లేదని చెప్పాడు. డీఆర్‌ఎస్‌ విషయాల్లో ఒత్తిడి తెస్తున్నాడని పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్ క్రికెటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని లాయిడ్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఇలా చేస్తే కోహ్లీ రెడ్ కార్డుతో మైదానం వీడే ఛాన్సు కూడా వస్తుందని హెచ్చరించాడు. 
 
కోహ్లీ ఇటు అంపైర్లు, అటు ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ వాగ్వాదాలకు దిగుతున్నాడని, తన మాటలు, చేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని డేవిడ్‌ లాయిడ్‌ మండిపడ్డాడు. తాజాగా మంగళవారం జరిగిన తొలి వన్డేలోనూ (బట్లర్‌తో వాగ్వాదం) అలాంటిదే జరిగింది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగకూడదు. నోరు లేని ఐసీసీ కూడా ఏం చేయలేకపోయింది' అని లాయిడ్‌ తీవ్రంగా స్పందించాడు. 
 
అలాగే విరాట్‌ కోహ్లీ ఇప్పుడున్న హోదాలో.. తను ఏం మాట్లాడినా, ఏం చేసినా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై అంపైర్లు తగిన చర్యలు తీసుకునేలా.. పసుపుపచ్చ, ఎర్ర రంగు కార్డులు అందజేయాలి. ఎందుకంటే అంపైర్లు ఇప్పుడు ఏ చర్య తీసుకునేలా కనిపించడంలేదు' అని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు పేర్కొన్నాడు.