రోహిత్ శర్మ సరికొత్త రికార్డు : రెండో క్రికెటర్‌గా గుర్తింపు
భారత క్రికెట్ జట్టులో హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ ఇపుడు మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మెట్ ట్వంటీ20లో 9 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొదటి స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.
కాగా, మోతేరా స్టేడియంలో గురువారం ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో జరిగిన నాలుగో ట్వంటీ20 మ్యాచ్‌లో రషీద్ బంతికి సింగిల్ తీయడం ద్వారా ముంబైకర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా షార్ట్ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్ రోహిత్ నిలిచాడు.
తన 9 వేల రన్స్‌లో సగానికి కంటే ఎక్కువగా ఐపీఎల్ ద్వారానే రావడం విశేషం. కెరీర్లో 110 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 32.41 యావరేజ్‌తో 2800 రన్స్ చేశాడు. ఐపీఎల్, ఇంటర్నేషనల్స్ కలుపుకుని 342 మ్యాచ్‌లలో 9001 రన్స్ పూర్తి చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జనవరిలో రోహిత్.. వన్డేల్లోనూ 9 వేల రన్స్ పూర్తి చేసిన థర్డ్ ఫాస్టెస్ట్ ఆటగాడిగా నిలిచాడు.