గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (11:43 IST)

వీరేంద్ర సెహ్వాగ్, కోహ్లీల శిఖర్ ధావన్ రికార్డ్ సమం..

పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలివన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఆపై లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
 
టీ20 సిరీస్‌లో జట్టులో చోటు దక్కవపోవడంతో మానసికంగా సిద్ధమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (98) భారీ అర్థశతకాన్ని సాధించాడు. అదే సమయంలో వికెట్ కోల్పోవడంతో ఒత్తిడికి లోనైన శిఖర్ ధావన్ ఓటయ్యాడు. తద్వారా వన్డేల్లో 90లలో అవుటైన వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును ధావన్ సమం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 98 పరుగులకు ఔట్ కావడం ద్వారా.. వన్డేల్లో తొంబైలలో సెహ్వాగ్, విరాట్ కోహ్లీ ఆరు పర్యాయాలు ఔట్ కాగా, తాజాగా ఆ జాబితాలో ధావన్ చేరిపోయాడు. 
 
వన్డేల్లో అత్యధికంగా 18 పర్యాయాలు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వికెట్ చేజార్చుకున్నాడు. అందులో అధిక మ్యాచ్‌లు భారత్ విజయాన్ని అందుకోవడం గమనార్హం. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఏడుసార్లు 90లలో ఔటయ్యాడు. మరో ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీలు సైతం 6 పర్యాయాలు 90లలో ఉండిపోయారు.