1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:16 IST)

ఎఫ్ 3- .షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం

F3 new still
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది. ఇప్పటికే శర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది. 
 
ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి త‌న గ్రాఫ్‌ని పెంచుకుంటూ సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు`తో కలెక్షన్ల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి. ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వ‌రస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ మరియు యంగ్ హీరో కలిసి F2తో అందించిన వినోదం ప్రేక్షకుల‌హృద‌యాల్లో ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది. 
 
ఈ చిత్రం మీదున్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.
 
తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో  సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. 
 
ఎఫ్ 2 సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతకు మించి అనేలా.. ఎఫ్ 3 కోసం స్పెషల్ ట్యూన్లను దేవీ శ్రీ ప్రసాద్ సిద్దం చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.