ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (16:18 IST)

`పాగ‌ల్` స‌క్సెస్‌తో నిర్మాత‌గా చాలా హ్యాపీగా ఉన్నాను: బెక్కెం వేణుగోపాల్‌

Beckham Venugopal
విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌`. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌లై విజయవంతమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
- `పాగ‌ల్‌` సినిమా షూటింగ్ 2019లో స్టార్ట్ కాగానే క‌రోనా ప్ర‌భావం మొద‌లుకావ‌డంతో షూటింగ్ ఆగిపోయింది. మ‌ళ్లీ న‌వంబ‌ర్‌లో షూటింగ్స్‌కు ప‌ర్మిష‌న్ రాగానే చ‌క‌చ‌కా పూర్తి చేసుకుంటూ వ‌చ్చాం. ఈ ఏడాది మే నెల‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో సెకండ్ వేవ్ స్టార్ట్ కావ‌డంతో సినిమా మ‌ళ్లీ విడుద‌ల వాయిదా ప‌డింది.
 
- చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా పాగ‌ల్ సినిమాను విడుద‌ల చేశాం. అప్ప‌టికే విడుద‌లైన సినిమా టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ ప్రేక్ష‌కులకు న‌చ్చి ఉన్నాయి. త‌క్కువ రోజుల్లో రిలీజ్ అనుకుని చేశాం. శ‌ని, ఆదివారాలు మాత్ర‌మే వీకెండ్స్‌గా వ‌చ్చాయి. అయితే ప్రేక్ష‌కులు సినిమాను చ‌క్క‌గా ఆద‌రించ‌డంతో ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్స్‌కు ద‌గ్గ‌ర‌గా రీచ్ అయ్యాం. ఇప్ప‌టికీ యావ‌రేజ్‌గా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.
 
- 14 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. ప్ర‌తి ఏడాది ఓ సినిమా మా బ్యాన‌ర్లో విడుద‌లవుతుంది. ప్ర‌తి సినిమాను ఎంత జాగ్ర‌త్త‌గా చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల 98 శాతం నేను న‌ష్ట‌పోలేదు. ఎగ్జిబిట‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌.. ఇలా ముగ్గురు హ్యాపీగా ఉన్న సినిమానే నా దృష్టిలో సూప‌ర్ హిట్ సినిమా.
 
- ఈ సినిమాను నేను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. ఓన్ రిలీజ్ చేసుకున్నా. నిర్మాత‌గా చాలా హ్యాపీగా ఉన్నాం. సెప్టెంబ‌ర్ 3న మా పాగ‌ల్ సినిమా అమెజాన్‌లో విడుద‌ల‌వుతుంది. శాటిలైట్ హ‌క్కులు కూడా అమ్ముడైపోయాయి.
 
- విశ్వక్ సహా అందరూ ఈ సినిమాను ఎంతో నచ్చి చేశాం. ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీలో విడుదలవ కావడం ప్రాబ్లెమ్‌గా అనిపించ‌లేదు. నైజాంలో ఇష్యూస్ లేదు. ఆంధ్రాలో టికెట్ రేట్స్ త‌గ్గించ‌డం,  మూడు షోస్ అయ్యాయి. సెకండ్ షోస్‌కు ప‌ర్టికుల‌ర్‌గా ఉండే ఆడియెన్స్ రాలేదు. అవ‌న్నీ పోయాయి.
 
- సినిమా ఇండ‌స్ట్రీపై ఆధార‌ప‌డిన వ్య‌క్తిగా ప‌రిస్థితులు త్వ‌ర‌గా చ‌క్క‌బ‌డాల‌ని అనుకుంటున్నాను. ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత సినిమాలు విడుద‌లైన‌ప్పుడు ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు బాగా వ‌చ్చారు. క‌రోనా వెళ్లిపోయింద‌ని అనుకున్నారంద‌రూ. అంద‌రూ ఎంజాయ్ చేశారు. వ‌కీల్‌సాబ్ విడుద‌లైన ఐదు రోజుల‌కు మ‌ళ్లీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. సాధార‌ణంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌స్తేనే భారీ క‌లెక్ష‌న్స్ ఉంటాయి. వాళ్లు లేక‌పోతే క‌లెక్ష‌న్స్ అనుకున్నంత‌గా ఉండ‌వు.
 
- ఒకేసారి ఈ క‌రోనా భ‌యం పోదు.. క్ర‌మ‌క్ర‌మంగా భ‌యం త‌గ్గుతుంది. కాస్త టైమ్ ప‌ట్టొచ్చు.
 
- థియేట‌ర్స్ బ‌త‌కాల‌ని అంటున్న వాదన‌లో త‌ప్పులేదు. కానీ ఆడియెన్స్ పూర్తిస్థాయిలో థియేట‌ర్స్‌కు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో చిన్న సినిమాలు విడుద‌ల చేసుకుంటూ వెళ్లి ఒక్క‌సారిగా పెద్ద సినిమాల‌ను విడుద‌ల చేస్తే ఆ ఫ్లోట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకుంటున్నాను.
 
- శ్రీవిష్ణు హీరోగా పోలీస్ ఆఫీస‌ర్ బ‌యోపిక్ త‌ర‌హాలో ఓ సినిమాను చేస్తున్నాం. డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. దీన్ని థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాం. ఇప్పుడు నేను సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసినా ఓన్‌గానే చేసుకుంటున్నాను.