మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (14:00 IST)

ఆర్ఎక్స్ 100 హిందీలో వచ్చేస్తోంది..

RX100
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడు. ఈ యేడాది ఇప్పటికే 'మోసగాళ్ళు' సినిమాలో కీలక పాత్ర పోషించిన సునీల్ శెట్టి, వరుణ్‌ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'గని' మూవీలోనూ నటించాడు.
 
విశేషం ఏమంటే. తెలుగు సినిమా 'ఆర్.ఎక్స్. 100' హిందీ రీమేక్ ద్వారా సునీల్ శెట్టి తన కొడుకు ఆహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. మిలన్ లూధ్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న 'తడప్' చిత్రంలో తారా సుతారియా నాయికగా నటిస్తోంది.
 
నిజానికి ఈ యేడాది సెప్టెంబర్ 24న ఈ మూవీని విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు చిత్రాల రిలీజ్ డేట్స్ రీ-షెడ్యూల్ కావడంతో 'తడప్'ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.